Header Banner

ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ఆ నలుగురిని కస్టడీకి ఇవ్వండి.. సిట్ పిటిషన్!

  Mon May 19, 2025 16:13        Politics

ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులు నలుగురిని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఈ కేసులో ఏ1గా ఉన్న కశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. వీరు నలుగురిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ బృందం పేర్కొంది. మద్యం ముడుపులు, కమిషన్ వ్యవహరంలో ఈ నలుగురికి తెలిసి కొన్ని విషయాలు జరిగాయని.. అందువల్లే నలుగురిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అప్పుడు మాత్రమే ఈ కేసు తదనంతర దర్యాప్తుకు అవకాశం ఉంటుందని తెలిపింది. సిట్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రాజ్‌కసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజయవాడ కోర్టులో మూడు రోజుల క్రితం పిటిషన్ వేసింది.

 

ఇది కూడా చదవండి: మందుబాబులకు బిగ్ షాక్.. పెరిగిన మద్యం ధరలు! ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి.!

 

ఈ పిటిషన్‌పై ఈరోజు ఏసీబీ కోర్టు విచారణకు రాగా.. కసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. విచారణను ఏసీబీ కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. ఇదే సమయంలో నలుగురు కీలక నిందితుల కస్టడీ పిటిషన్‌పై కోర్టు రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో ఏ33గా ఉన్న గోవిందప్పను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అలాగే లిక్కర్ కేసులో ఏ30 పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దిలీప్‌కు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు విఘాతం కలుగుతుందంటూ పేర్కొన్నారు. ఈ కేసులో దిలీప్ ద్వారా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపించారని సిట్ అధికారులు తెలిపారు. పైలా దిలీప్ బెయిల్ పిటిషన్‌పై రేపు కోర్టులో విచారణ జరుగనుంది. ఇక ఈ కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు రేపు విచారించనుంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Liquor #Assam #ArunachalPradesh